Friday, March 31, 2017

 

Low budget creativity

ప్రొడ్యూసర్: " ఇదిగో రైటరూ, ఇంకా ఎన్నాళ్లయ్యా ఇలా కమర్షియల్ సినిమాలు తీస్తూ కూర్చుంటాం? హాలివుడ్ తరహా లొ మనం కూడా ఒక మంచి సినిమా తియ్యాలయ్యా.."

రైటర్ : " ఎంతమాటన్నారు సార్! ఇలా ప్రొత్సహించె నిర్మాత దొరకాలే గాని, అదెంత పని?"

" జురాసిక్ పార్క్, కింగ్ కాంగ్ తరహా లొ ఏదైన స్క్రిప్ట్ ఆలొచించు. నిర్మించి పెడతా.. "

" ఒక వందడుగుల ఎత్తున్నభయంకరమైన డ్రాగన్ నెపధ్యం లొ ఒక స్టోరి అనుకుందామా సార్?"

" మరీ వందడుగులంటె, బడ్జెట్ సరిపోదేమో.ఏదైన సింపుల్ గా ఆలొచించవయ్యా"

పెట్టాడు మెలిక, దరిద్రుడు. అని మనసులొ  అనుకుంటూ, "ఓకె సార్. ఆ డ్రాగన్, మనుషుల కంటికి కనిపించదు అని వ్రాసుకుందాము . గ్రాఫిక్స్ ఖర్చు మిగులుతుంది . ఏమంటారు?"
 
" అద్గది! ఇప్పుదు లైన్లోకొచ్చావ్!! అదే టైప్ లో, కొంచెం సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ లాంటివి కూడ యాడ్ చేస్తె, ఏ సెంటర్ల వాళ్ళకి, మల్టిప్లెక్స్ జనాలకి బాగ ఎక్కుద్ది.."

(చలి మంటేసుకోడానికి వుడ్ లేదు కాని, హాలివుడ్ రేంజ్ సినిమా కావలంట, జియొ సిం తో మిస్డ్కాల్ ఇచ్చే మొహమూ వీడు).
"అలాగె సార్..యాడ్ చేద్దాం.
కట్ చేస్తే, ఒక ల్యాబొరటరి లో సైంటిష్టులు ఒక టైం మెషీన్ కనిపెట్టే ప్రయత్నం లొ నిమగ్నమై ఉంటారు."

"ఓకే. ఎఫెక్ట్ కోసం ఇక్కడ మనం కొన్ని, టెస్ట్ ట్యూబులూ, మరుగుతున్నట్టు కనిపించే కెమికల్స్తో ఒక సెట్ వెద్దాం"

(బీ కాం లొ ఫిజిక్స్ ఉన్నప్పుడు, ఫిజిక్స్ ల్యాబులో కెమికల్స్ పెట్టడం తప్పులేదు కదా ! అయినా , లాజిక్ కోసం వెతకడానికి మనమేమన్నా ఆస్కార్ అవార్డు కోసం తీస్తున్నామా .),
" సూపర్ ఐడియా సార్. మీరు అసలు ఇక్కడ ఉండాల్సిన వారు కాదు!
అలా కనిపెట్టిన టైం మెషీన్ లొ అనుకోకుండా మన హీరో, హీరోయిన్ మరియు బ్రహ్మానందం క్రీస్తుపూర్వం 350 వ సంవత్సరానికి వెళ్ళిపోతారు. అక్కడ వారు ఏదుర్కునే సమస్యల మధ్య కధ ముందుకి సాగుతుంది."
(బ్రహ్మానందం ఎందుకని అడక్కండి . హారర్ సినిమా అయినా , కామిక్ రిలీఫ్ కంపల్సరీ. )

"అక్కడె ఆగు. మళ్ళీ బడ్జెట్ సంగతి మర్చిపోయావయ్యా నువ్వు. టైం ట్రావెల్ ఉండాలి. కాని, ఆ పీరియడ్ సెట్లు, రాజులు, గుర్రాలు అంటే, తడిసి టీవీయెస్ అవుద్ది. "

"టీవీయెస్ ఏంటి సార్?"
"తడిసి 'మోపెడ్' అంటే రొటీన్ అని, టీవీయెస్ అన్నానంతె. హహహ!"

(ఒరేయ్య్! నీదగ్గర ఈ యాంగిల్ కూడా ఉందా, వర్డ్ డాక్యుమెంట్ లో వెనకవైపు కూడా వాడుకుకునే వెధవ) "వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సార్.
లిటరల్లీ రాఫ్ల్ అంటే నమ్మండి.
అయితె టైం ట్రావెల్ ఉండాలి కాని, రాజుల కాలం సెట్లు వద్దంటారు.
ఒక పని చేద్దాం. హీరొ హీరొయిన్ బ్రహ్మనందం టైం మెషీన్ ఎక్కి క్రీస్తు పూర్వం 350 వ సంవత్సరనికి వెళ్ళి, అక్కడ ఆగకుండా మళ్ళి ప్రస్తుతం లోకి వచ్చేస్తారు. మిగతా కధంతా ప్రస్తుతం లోనే నడుస్తుంది.
ఆ తర్వాత ఆ కనిపించని డ్రాగన్ బారి నుండి హీరో, హీరోయిన్ ని కాపాడతాడు.
కట్ చేస్తే, ఇక్కడో ఐటెం సాంగ్ వేసుకోవచ్చు... "


(హమ్మింగ్ సౌండ్)" నీ చూపే ఒక గన్ ..నువ్వే నా డ్రాగన్".."లిరిక్ దొరికేసిందయ్యా! ఉండు ఎస్సెస్ తమన్ కి కాల్ చేస్తా !!మరి టైటిల్ ఏం పెడదాం?"

"కనపడని డ్రాగన్, తిరిగొచ్చిన టైం మెషీన్".
 




Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]