Wednesday, September 12, 2012

 

Chodaka Rahita Sakatam

సమయం రాత్రి పదిగంటలు దాటి, అరవై నిముషాలు అయ్యింది.
ILABs లో బయలుదేరి, KPHB సిక్స్త్ ఫేజ్ లో ఇద్దర్ని, ప్రగతి నగర్ లో ఒకర్ని, వివేకానంద నగర్ కాలని లో ముగ్గుర్ని, హౌసింగ్ బోర్డు లో మరో పదిమందిని డ్రాప్ చేసాక,
మా ఆఫీసు క్యాబ్ కుకట్ పల్లి చేరుకుంది. క్యాబ్ లో లాస్ట్ దిగే వాడిని నేనే కావడం తో, డ్రైవర్ పక్కన సీట్ కి మారిపోయాను.
మా డ్రైవర్ కి ఆకలేసింది అనుకుంటా, అరటి పళ్ళు కొన్నుకుని వస్తానని టాటా సుమో ని రోడ్ పక్కన పార్క్ చేసి, బండి దిగాడు.
ఆ టైం లో కూడా, బస్సు స్టాప్ అంతా జనాలతో సందడిగానే ఉంది.
మా బండి, బస్సు స్టాప్ కి ఒక యాభై మీటర్ల దూరం లో ఆపి ఉండొచ్చు అనుకుంటా. అక్కడ ఒక ముప్పై మందికి తక్కువ కాకుండా జనం, పార్క్ చేసి ఉన్న ఒక పది బైకులు, 
రెండు చెరుకురసం బళ్ళు, ఒక చాట్ బండి, ఇంకా రెండు మూడు ఆటోలు ఉన్నాయి.

ఎఫ్ఫెం రేడియో లో అప్పుడప్పుడు యాడ్స్ మధ్యలో వేసే పాటలు వింటున్నాను..
హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ లో ఉత్తర ఉగాండా, లో బంటు తెగ మాండలికం లో ఎండా కాలం ని తిడుతూ రాసిన "ర్యాప్" ని ఆస్వాదిస్తూ,
నా నోకియా ౩౫౦౦ ఫోన్ లో "స్నేక్ గేమ్" ఆడుతున్నాను.
ఆఫీస్ లోనే భోజనం చెయ్యడం వల్ల అనుకుంటా, అప్పుడే కొంచెం నిద్ర కూడా వస్తూంది.
కళ్ళు నులుపుకుంటూ, ఎందుకో అలా కిటికీ బయటకి చూసాను. ఎం జరుగుతుందో సరిగ్గా అర్ధం కాలేదు కానీ, మొత్తానికి ఏదో తేడాగా అనిపించింది.
ఆ తేడా ఏంటో గుర్తించేలోగా, నాకో విషయం అర్ధం అయ్యింది. మా బండిని సరిగ్గా పార్క్ చెయ్యలేదనుకుంటా, దానంతట అదే అలా ముందుకు వెళ్ళిపోతుందని!!!!!
ఆ విషయం జీర్ణించుకునే లోపే, ఇంకో విషయం గుర్తొచ్చింది, నాకు అప్పటికి కూరగాయల తోపుడు బండి మినహా, వేరే ఏ ఫోర్ వీలర్ నడపడం రాదు సరి కదా, కనీసం
యాక్సేలరేటార్ కి బ్రేక్ కి కూడా తేడా తెలియదు!!!!
చూస్తుండగానే, బండి మెల్లగా హైవే ఎక్కేసింది...ఇలా జరిగినప్పుడు, ఏమేమి జరగోచ్చో అన్ని చాలా స్పష్టంగా , హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్టు, గ్రాఫిక్స్ లో వీడియో, డీ టీ యస్ లో ఆడియో తో సహా
కనిపించింది...
అప్పుడే సడన్ గా ఒక ఐడియా తట్టింది..బ్రేక్ కి యాక్సేలరేటార్ కి తేడా తెలియకపోయినా, స్టీరింగ్ అంటే ఏంటో, అది తిప్పితే ఎం జరుగుతుందో కొంచెం ఐడియా ఉంది..
ఎం జరిగితే అది జరగని అని అనుకుని, స్టీరింగ్ ని మొత్తం ఎడమ వైపుకి తిప్పేసా...బండి కాస్తా, హైవే నుండి పక్కకి తప్పుకుని, బస్సు స్టాప్ లోనికి వెళ్ళడం మొదలెట్టింది..
నాకు సాధ్యమైనంత గట్టిగా జనాలకు, ఈ విషయం అర్ధం అవ్వాలని అరుస్తూ, స్టీరింగ్ ని అలాగే ఎడమ వైపుకి పట్టి ఉంచాను...
బండి ఆల్మోస్ట్ ఒక రిద్దరిని గుద్దినంత పని చేసినా , వాళ్ళ అదృష్టమో, నా అదృష్టమో మొత్తానికి అందర్నీ దాటుకుంటూ వెళ్లి, చివర్న పార్క్ చేసి ఉన్న ఒక బైక్ ను గుద్దేసాను....

అక్కడే చిన్న ప్రాబ్లం, ఆ బండి మీద ఒక కుర్రాడు కూర్చుని ఉన్నాడు.
అపటికే కొంచెం విషయం అర్ధం అయిన జనాలు అంతా గుమి కూడారు.
"ఎవడ్రా బండి నడుపుతుంది??" అని ఒకడు
"ఎవడ్రా నీకు లైసెన్సు ఇచ్చింది ???" అని ఇంకొకడు,
"ఇంకా మాట్లడతారెంటండి, నాలుగు తగిలించకుండా..." అని మరొకడు, స్క్రిప్ట్ చదువుతున్నట్టు గా స్టాండర్డ్ డైలాగ్స్ వదిలారు..

ఇంకా ఎవరు చెయ్యి చేసుకోకముందే, మొత్తం విషయం కక్కేసాను..
"బ్రేక్ వేయ్యోచ్చుగా??!!"
"హ్యాండ్ బ్రేక్ వేయ్యోచ్చుగా??"
"బండి స్టార్ట్ చేసి, ముందుకెళ్ళి ఆపోచ్చుగా???"
ఇలా ఒక వంద కోస్చేన్స్ మధ్యలో ఒకసారి విరక్తి గా నవ్వుకున్నా..
ఇంతలో మా బండి డ్రైవర్ రానే వచ్చాడు..
"ఎవడ్రా బండి నడుపుతుంది??" 
"ఎవడ్రా నీకు లైసెన్సు ఇచ్చింది ???" 
"ఇంకా మాట్లడతారెంటండి, నాలుగు తగిలించకుండా..." 
మళ్లీ అవే డైలాగ్స్  రిపీట్ చేసారు..
ఈసారి దెబ్బ తగిలిన అబ్బాయి ఒక అడుగు ముందుకువేసి, ఒక రెండు దెబ్బలు కూడా వేసాడు..
అది సరిపోదన్నట్టు, వాళ్ళ పోలీసు మామయ్యకి, ట్రాఫ్ఫిక్ కమీషనర్ కి, డీజీపీ కి, హోం మినిస్టర్ కి, చీఫ్ మినిస్టర్ కి ఫోన్ చేసాడు.
సినిమా క్లైమాక్స్ చేరుకుంది అని తెలియజేయాలి అన్నట్టు, లోకల్ పోలీసు జీప్ రానే వచ్చింది.

మల్లి, జరిగిన కధ అంతా వివరించాను. వాళ్ళు మొత్తం స్టొరీ విని, నన్ను షేర్ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపొమ్మన్నారు..
ఆ తర్వాత దెబ్బ తగిలిన అబ్బాయికి "అవుట్-అఫ్-ది-కోర్ట్" సెటిల్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారనుకుంటా..
ఆ కుర్రాడు మాత్రం అసలు తగ్గే సమస్యే లేదని భీష్మించుకు కూర్చున్న నేపధ్యం లో ఒక పోలీసు బైక్ మీద ఒక కానిస్టేబుల్, డ్రైవర్ మరియు ఆ కుర్రాడు పోలీసు స్టేషన్ కి వెళ్ళిపోయారు..

మర్నాడు ఉదయం నేను కార్ డ్రైవింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాను..



This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]