Monday, March 12, 2012
Rahul "The Wall" Dravid
ఈ స్పూఫ్ రాహుల్ ద్రావిడ్ కి అంకితం..
ఆపొసిట్ టీం కోచ్:-
"ఎవడైనా బలంగా కొడతాడు.లేదా, కోపంగా కొడతాడు..
కాని వీడేంటి రా, చాల శ్రద్ధగా కొట్టాడు...
ఏదో ఒక "గోడ" కట్టినట్టు...
గులాబి మొక్కకి అంటూ కట్టినట్టు...
చాల జాగర్తగా , పద్దతిగా కొట్టాడు...
ఆడు బాట్స్మెన్ రా బుజ్జి.."
ఆపొసిట్ టీం కాప్టైన్:-
"ఛి..మొన్నటి నుండి చూస్తున్నాను , వాడు బాట్స్మెన్ బాట్స్మెన్ అని ఒకటే నస ..ఆడు బాట్స్మెన్ అయితే మేము జింబాబ్వే గాల్లమా?
నువ్వు ఊ అను, వాడి వికెట్స్ విరగ్గొట్టి మన పిచ్ లో సా డస్ట్ గ వేయిస్తా "
కోచ్: " వద్దు రా బుజ్జి, సా డస్ట్ లేకపోతే మిల్లు కి వెళ్దాం కానీ..ఆడితో పెట్టుకోవద్దు రా బుజ్జి.."
కాప్టైన్ : " పోనీ బౌన్సర్స్ వెయ్యించనా?"
కోచ్: " అవుట్ చెయ్యాలంటే బౌన్సర్స్ , బీమర్స్ ఎందుకు రా??"
కాప్టైన్: " మరి ఎం చెయ్యమంటావ్? నీలా టీవీ చూస్తూ కూర్చోమంటావా?"
కోచ్: " రేయ్..బ్యాటింగ్ లో దిగేటప్పుడు వాడి కళ్ళల్లో కాన్సంట్రేషన్ చూసావా..అలాంటిది వాడిని అవుట్ చెయ్యాలంటే మనకెంత కాన్సంట్రేషన్ ఉండాలో తెలుసా.."
"అన్నట్టు అందరు పేస్ బౌలర్స్ ఎందుకు రా..ఆస్ట్రేలియా లో కానీ ఆడుతున్నామా? ఒక ఇద్దరు స్పిన్నర్స్ ఇద్దరు మీడియం పేస్ బౌలర్స్ తీసుకెళ్ళు..అసలే ఇంజురీ లిస్టు పెద్దదవుతుంది.."
Labels: Cricket, Rahul Dravid, Spoof, Telugu
Subscribe to Posts [Atom]