Wednesday, November 21, 2007

 

ఈ వర్షం సాక్షిగా ...

KPHB ఎలైట్ బేకరి దగ్గరికి వచ్చేసరికి నల్ల మబ్బు ముసుగు లో నుండి సూర్యుడు కనిపించీ కనిపించకుండా ఉన్నాడు.
సమయం నాలుగున్నర అవుతున్నా చీకటి బాగానే కమ్ముకుంది ...
ఎక్కడో దూరంగా ఒక మెరుపు...
ఒక నాలుగు సేకన్ల వ్యవధి లో ఒక ఉరుము........
" 1324 మీటర్లు..."
మస్తాన్ ఏదో కాల్యుకులేట్ చేస్తున్నట్టు అన్నాడు....
నేను ఏమిటన్నట్టు సైగ చేసా....
"మెరుపు వచ్చిన దూరం" అంటూ నవ్వాడు మస్తాన్ ....
వీడు మారడు అన్నట్టు నితిన్ తలాడించాడు....
రెడ్డి చికెన్ సెంటర్ దగ్గరికి వచ్చేసరికి చినుకులు మొదలయ్యాయి ...
చేతిలో ఉన్నా పుస్తకాలని తలపై అడ్డు పెట్టుకుంటూ మస్తాన్ వాళ్ల బిల్డింగ్ కి చేరుకున్నాం.
ఫస్ట్ ఇయర్ తర్వాత మస్తాన్ , నితిన్ , రంజిత్, జీవి ఈ రూం కి మారారు...
రెండు బెడ్రూమ్స్ మరియు ఒక చిన్న కిచెన్ తో గొప్పగా కాకపోయినా , ఫస్ట్ ఇయర్ లో ఉన్న ఇల్లు కంటే బావుంది..
డోర్ నాక్ చెయ్యగానే రంజిత్ తలుపు ఓపెన్ చేసి మళ్లీ తన రీడింగ్ చైర్ మీద వాలిపోయాడు ...
జీవి యదావిధి గా ఎలేక్ట్రికాల్ టెక్నాలజీ పుస్తకం తొ ఏదొ కుస్తీ పడుతున్నాడు...
ఒక ఇరవై నిముషాలు గడిచింది.....
"అసలు ఏందీ వీడు??" తల పట్టుకుంటూ బ్లాకు ప్యాడ్ మిల్ల్మన్ అండ్ హల్కియాస్ బుక్ మీద ముప్పై రెండో సారి మస్తాన్ తన చికాకు ని వెలిబుచ్చాడు....
ఫస్ట్ ఇయర్ అయ్యి నాలుగు నెలలు అయినా మస్తాన్ కి రోజుకు కనీసం ముప్పై సార్లైనా మిల్ల్మన్ ని తిట్టుకోనిదే పొద్దు కుంగదు..:)
దిక్కులు దద్దరిల్లేలా తూరుపు వైపు నుండి మరో ఉరుము రూం లో ఉన్న అందరి ద్రుష్టి డోర్ వైపుకి మరల్చింది ....
ఆకాశం నుండి భూమికి ఏదో సందేశాలు పంపిస్తున్నట్టు వర్షం మాక్కూడా ఎందుకో చాలా అందంగా కనిపిస్తోంది ఆరోజు....
అంతలో మస్తాన్ వాళ్ల బిల్డింగ్ కి కొద్ది దూరంలో మరొక టెర్రెస్ మీద ఒక అమ్మాయి...
కాదు కాదు..
ఇద్దరు అమ్మాయిలు ....
సుమారు పదిహేడు లెదా పద్దెనిమిది వసంతాల అచ్చ తెలుగు అమ్మాయిలు....
ఇందులో వింత ఏముంది అని అడగకండి....
పైనుండి కురుస్తున్న వానకి సహజంగా స్పందించే నెమళ్ళ లాగా...
గాలికి కదిలే చిగురాకుల సవ్వడికి బెదిరే జింక పిల్లల లాగా...
తొలకరి వానకి నిండిన పిల్ల వాగు ప్రవాహం లా....
అవధుల్లేని ఆనందం తో...
నాగరికత బంధాల మధ్య ఇన్నేళ్ళుగా తమలో ఇరుక్కుని ఉన్నా స్వేఛ్ఛా విహంగాన్ని విశాలమైన ఆకసమంతా మీదే అంటూ వదులుతున్నట్టుగా ...
నర్తిస్తున్నారు...
అలుపు లేకుండా..
బిడియం భయం వంటి మానవీయ భావాలకి అతీతంగా ...
రూపులేని రేపటి గురించి ఆలోచించకుండా...
తిరిగిరాని నిన్నటి గురించి బాధలేకుండా ...
నిష్కల్మషంగా..నిర్మొహమాటంగా ...
చినుకుల సంగీతానికి లయబద్ధంగా నర్తిస్తున్నారు...
ఆ సమయం లో మాకు నిన్న జరిగిన మిడ్ టర్మ్ ఎగ్జాం కని రేపు సబ్మిట్ చెయ్యాల్సిన అసైన్మెంట్స్ కాని ...
ఏమి గుర్తుకురావడం లేదు...
అలా ఎంత సేపు చూసామో మాకే తెలియలేదు...
ప్రతి మంచి విషయానికి ఒక అంతం ఉంటుంది అనే నానుడి గుర్తు చేస్తున్నట్టు వర్షం తగ్గుముఖం పట్టింది.....
కాని ఆ ఇద్దరమ్మాయిలు, ఆకలి తీరని అతిథుల్లాగా మరో జల్లుకై వేచిచూస్తున్నారు....
నిజానికి మేము కూడా మరో జల్లుకోసం వేచిచూసాం అనాలేమో!!!

Comments:
Hey...Ravi...adae varsham saakshigaa...this is very very nice. Naenu koodaa eduruchoostunna...ikkada.
 
:)
neeloni kavini a varsham nidralepinanduku entho santoshistunnam.. :)
lovely post...
 
Hey Ravi.... chala bavundi... varsham meedottu!
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]