Friday, November 02, 2007

 

ఇంటర్ లో వింటర్ మార్నింగ్

గమనిక: ఇది కేవలం నా జ్ఞాపకం కి బ్లాగు రూపం మాత్రమె. ఇందులో ట్విస్ట్ లు ఎక్స్పెక్ట్ చెయ్యకండి :)
"కి కి కి కి...""కి కి కి కి..""కి కి కి కి" అంటూ అసేండింగ్ పిచ్ లో ఒర్పాట్ గడియారం మోగడం ప్రారంభించింది ."ఒరేయ్ రవి లెగరా టైం పావు తక్కువ అయిదు అయ్యింది..బస్ మిస్ అవుతుంది మళ్లీ.." రెండు దుప్పట్ల లోనుండి కూడా లోకేష్ వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది .."ఒక్క ఐదు నిముషాలు తర్వాత లేస్తా లేన్తాక్"(నేను లోకేష్ ని అలాగె పిలిస్తా అనమాట ..) అంటూ బద్దకంగా చెప్పాను..కాని వెంటనే 272 మిస్ అయితే మళ్లీ ఎంత ప్రాబ్లం అవుతుందో అనుకుని అయిష్టంగానే లేచాను. తొందరగా మొహం కడుక్కుని బ్రష్ చేసి కెమిస్ట్రీ, ఫిజిక్స్ బుక్లెట్స్ పట్టుకుని బయలుదేరాను..జనవరి చలి అప్పుడప్పుడే మొదలవుతుంది అనుకుంటా, నేను వేసుకున్న కాటన్ చొక్కా చలి ని పెద్దగా ఆపడం లేదు.. ..వీధి చివర గోపీ మిల్క్ బూత్ ముందు స్వరాజ్ మజ్డా నుండి పాల కార్తన్స్ లో దింపడం పూర్తయినట్టు ఉంది , అంటే, ఆ రోజు 272 మిస్ అయినట్టే అనమాటఅని మనసులో అనుకుంటూ కొంచెం త్వరగా నడవటం స్టార్ట్ చేశాను..ఒక 100 మీటర్ల దూరం నుండి చూస్తుండగానే 272 ఒక 5 సెకన్ల లో బస్ స్టాప్ లో ఆగి వెళ్ళిపోయింది..
బస్ స్టాప్ లో ఒక ముగ్గురు మనుషులు మినహా అంట ఖాళీ గా ఉంది .బహుశా అమీర్పేట్ వైపు వెళ్ళే వాళ్లు అనుకుంటా...272 వెళ్ళాక ఒక 10 మినుట్స్ లో 230A అన్నసంగతి కొంచెం టెన్షన్ తగ్గించింది . గాలి కొంచెం ఎక్కువవ్వటం స్టార్ట్ అయ్యింది....అనుకున్నట్టే ఒక 10 మినిట్స్ లో 230a రానే వచ్చింది. లాస్ట్ సీట్స్ ఉండే ఏరియా లో అంతా కూరగాయలతో నిండి ఉంది..ఒక మూలలో ఖాళీ సీట్ కనిపించింది..లాస్ట్ సీట్ కావడం వల్ల చలి మరీ ఎక్కువగా ఉంది..అప్పటిదాకా ఆ సీట్ ఖాళీ గా ఉన్నా, నా ముందే నిల్చుని ఉన్నా వ్యక్తి యెన్దుకు ఆ సీట్ లో కూర్చోలేదో అప్పుడు అర్ధం అయ్యింది నాకు..:)సండే తెల్లవారి సమయం కాబట్టీ, డ్రైవర్ ఎక్కడ కుదిరితే అక్కడ 55 KMPH కి తగ్గకుండా తీసుకువేళ్తున్నాడు...ఇంకో గంటన్నర లో జరిగే వీక్లీ ఎగ్జాం కోసం ఏమైనా రివిజన్ అవుతుందేమో అని వెంట తెచ్చుకున్న బుక్-లెట్స్ ఓపెన్ చేశాను..కని పెద్ద ఇంట్రస్టు రావడం లేదు..కైనమటిక్స్ లో ఎగ్జాం అన్నమాట...పెద్ద కష్టం ఏమి కాకపోఇన, ఫోర్ములాలు అవీ బట్టి పట్టడం నాకు కొంచెం చిరాకు...ఇలాంటి ఆలోచనల మధ్య సికింద్రాబాద్ రానే వచ్చింది ...దూరంగా బర్కత్పుర డిపో కి చెందిన ఆర్టీసి బస్సు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు నుండి బయలుదేరడం కనిపించింది ...ఎంత తక్కువ అనుకున్నా, నేను ఉన్న బస్సు కి ఆ బస్సుకి కనీసం 200 మీటర్ల దూరం ఉంది....సాధారణంగా రద్ది గా ఉండే స్టేషన్ ట్రాఫిక్, ఆదివారం ప్రోదున్న కావడం వల్ల ఖాళీ గానే ఉన్నాయి..ఈ లెక్కన నేను డైరెక్ట్ గా ఆ బస్సు ఉన్నా వైపు కి వెళ్తే, ఆ స్పీడ్ లో బస్ ని క్యాచ్ చెయ్యడం జరగని పని .....రైల్వే స్టేషన్ ఘంట స్తంభం ఆల్రెడీ 6:10 అని టైం చూపిన్స్తునది, అంటే ఈ బస్సు మిస్ ఐతే, ఎగ్జాం కి లేట్ అవ్వడం ఖాయం..అదే టైం లో చిన్నప్పుడు చదువుకున్న ప్యతోగోరాస్ తియోరం గుర్తొచ్చింది...వెంటనే, మనోహర్ థియేటర్ పక్క సందు లోనుండి రేతి ఫైల్ బస్ స్టాండ్ కి కలిపే షార్ట్ కట్ లో పరుగందుకున్నాను..ఎంత పొద్దున్న టైం అయినా , ఆ రూట్ లో మినిముం కొంత ట్రాఫిక్ ఉంటుంది అన్నా నిజం ఒక్కటే బస్సు అందుతుంది అనే నమ్మకం ఇచ్చింది... ఆతర్వాత బస్సులు లేవా? అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు...బహుసా ఆ వయసు లో చాలేన్జేస్ అంటే సహజంగానే ఉండే ఇష్ఠం అనుకుంటా....దారి మధ్య మధ్య లో బస్సు నాకంటే ఎలా కాదనుకున్న 100 మీటర్ల దూరం మెయిన్టేన్ చేస్తుంది...రేతి ఫెయిల్ బస్ స్టాప్ దగ్గర రైట్ టర్న్ తీసుకోడానికి బస్ స్లో అవ్వడం ఖాయం...అనుకున్నట్టే స్లో అయ్యింది కూడా...నేను వేగం పెంచా .....గుండె వేగం ఒంట్లో వేడి పెంచి చలి మాయం చేసింది... ఇప్పుడు బస్సు నాకు చెయ్యి చాపితే టచ్ అయ్యే అంటే దగ్గర్లో ఉంది..డ్రైవర్ కి రేర్ వ్యూ అద్దమ్ లో నేను పరుగెత్తడం కనిపిస్తూనే ఉండొచ్చు...అలా కనిపిస్తే మాత్రం నాకు బస్సు దొరికె చాన్సేస్ తక్కువ అవుతాయి...అదేంటో మరి, హైదరాబాద్ బస్సు డ్రైవర్స్ కి బస్ చేసర్స్ అంటే ఒక రకమైన కసి ..ఈసారి ఇంకొంచెం వేగం పెంచాను...చేతికి ఫుట్-బోర్డు పక్కన ఉండే రాడ్డు దొరికింది....ఆ సమయం lo బస్సు నన్ను లాగడం నా కాళ్ళు గాలిలో తెలిపోడంనాకు స్పష్టంగా తెలుస్తున్నాయి...పట్టు విడవకూడదని ఒకపక్క మనసు చెబుతుంది...., ఇంతకు ముందు పడిన దెబ్బలు మాత్రం వదిలేయ్యు అని చెబుతున్నాయి....భయం గెలిచింది...ఆ సమయం లో బస్సు లోనుండి కండక్టర్ ఏమన్నాడో తెలియడానికి మీకు పెద్ద జనరల్ నాలెడ్జ్ అవసరం లేదు...నేను ఆల్మోస్ట్ చిలకల్గుడా బస్ స్టాప్ వరకు వచ్చేసన్న సంగత పక్కనే ఉన్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ చూస్తే అర్ధం అయ్యింది...నా గుండె వేగం గమనిస్తే బస్సు వేగం ఎంత ఉంటుందే కాలికు లేట్ చెయ్యొచ్చు.. వెనక్కు తిరిగీ చూసేసరికి 2J రానే వచ్చింది..ఆ బస్సు బస్ స్టాప్ లోకి చేరేలోపల నేను బస్ స్టాప్ కి చేరుకోవాలి ఊపిరి కొంచెం కుదుట పడేలోపే మల్లి పరుగందుకున్నాను...ఈసారి నేనే గెలిచాను... ర్త్క్ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చే సరికి నేను ఉన్నా బస్సు 1K ని ఓవర్ టేక్ చేసింది ..క్రాస్ రోడ్ లో దిగి ఆ బస్సు క్యాచ్ చేసి నారాయణ గూడ లో దిగి గబా గబా టిఫిన్ చేసి స్పెక్ట్రా చేరుకునే సరికి ఒక పావు గంట లేట్ అయ్యింది ...
Inka undi..

Comments:
Cinema kashtaalantae ivae. Poortigaa raastae gaani, comment raayadam kudaradu. Aa OSO anae mushti cinema (Oops! Noru jaaraa!) gurinchi koodaa raastae...appudu naenu comments poortigaa raastaa. Annattu..naenu inko set saametalu post chaesaanu.
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]