Sunday, February 03, 2013
Dummaa
ఉదయం పావు తక్కువ ఏడు గంటలయ్యింది.నిద్ర లేస్తూనే, జ్వరం, కడుపు నొప్పి, పన్ను పోటు లాంటి సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకున్నా.
ఉహు..కనీసం దగ్గు కూడా లేదు.. భారంగా కాళ్ళీడుస్తూ , బ్రష్ చేసుకోడానికి సిద్ధమయ్యాను ..
బయట వాతావరణం ఎలా ఉందొ ఒకసారి చూసాను. మబ్బులు లేవు. ప్చ్..
పొలం లో గింజ వేసిన రైతు కూడా మబ్బుల కోసం, వాన కోసం, నా అంత ఇదిగా వేచి చూడరేమో.
టీవీ పెట్టాను. ఎవరైనా పెద్దాయన పుటుక్కుమన్నారేమో అనే ఆశ తో. ఆ ఆశ కూడా అడియాశే అయ్యింది.
అలాంటి న్యూస్ ఏమి రాలేదు సరికదా, కనీసం బంద్ కూడా లేదు. బంద్ చేసేటంత పెద్ద సమస్యలు దేశం లో లేవా? అసలు అపోజిషన్ పార్టీ ఎం చేస్తుంది అని అడగాలనిపించింది, కాని, ఎవర్ని అడగాలో తెలియక ఊరుకున్నా.
సరే అపోజిషన్ పార్టీ వాళ్ళ సంగతి వదిలేద్దాం. మత ఛాందసవాద సంస్తలన్ని ఎమ్మయ్యాయి? ఒక మంచి కర్ఫ్యూ వచ్చి ఎన్ని యేళ్ళయ్యింది??అసలు దేశం ఎటు పోతుంది??అనే ప్రశ్నలు మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయం లో
డోర్ బెల్ మోగింది. నేను తీయడానికి వెళ్ళాను..ఆ తొందరలో డోర్ సందులో వేలు నలిగింది..ఔచ్..
నిజానికి అంత పెద్ద దెబ్బ కాకపోయినా, అనుకోకుండా కలిసి వచ్చిన సందర్భాన్ని, నాకు అనుకూలంగా మలచుకునే దిశగా, నేను నాలోని నటుడికి పని చెప్పా..
కళ్ళల్లో నీళ్ళు తెప్పించుకోడానికి పెద్దగ కాస్త పడకపోయినా, ఏడుపు లో డెప్త్ కోసం కొంచెం ఎక్కువే ట్రై చేశా అనుకుంటా..
అందరు అమ్మల్లాగానే, మా అమ్మ కూడా, నా ఏడుపుని నమ్మింది. ఇక అమ్మ నమ్మిందంటే, నాన్నని డీల్ చేయడం పెద్ద ఇష్యూ కాదని ఫిక్స్ అయిపోయాక , డిసైడ్ అయిపోయా..
ఈరోజు దుమ్మ కొట్టి తీరాల్సిందే అని!!!!
"dettol ఎక్కడుంది??" - అమ్మ
"రక్తం వస్తుందేమో చూడు.." - నాన్న
"చూసుకుని తియ్యోచు కదా.." - మళ్ళీ అమ్మ..
"పెన్సిల్ పట్టుకోగలవా??" - ఈసారి నాన్న..
"ఈరోజు ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా??" - అమ్మ..
"తమ్ముడు ఈరోజు స్కూల్ కి రాడా?" - అక్క..
"తమ్ముడు ఈరోజు స్కూల్ కి రాడా?" - అక్క..
సరిగ్గా ఆ ప్రశ్న దగ్గర ఆగిపోయా..ఎందుకంటే, ఆ ప్రశ్న కి తర్వాతి ప్రశ్నలు అంతరార్ధం ఏంటో అందరికి తెలుసు.
ఇంతలో, దూరంగా మా స్కూల్ లంచ్ బెల్ మోగిన శబ్దం. "ఇప్పుడు" పన్నెండున్నర అయిందా అనుకుంటూ, ఇంటికి వెళ్ళాను..
ఒక అయిదు నిమిషాల తర్వాత అక్క ఇంటికి వచ్చింది. అమ్మ ఇద్దరికీ భోజనం పెట్టి, తను తినింది..ఒక పక్క మా అక్కేమో, నేను ఎంచక్కా డుమ్మా కొట్టేశాను అని కుళ్ళుకుంటూ ఉండగా, నేను మాత్రం సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నా.
ఇప్పుడు నొప్పి కొంచెం తగ్గిందేమో కదా, హాఫ్ డే నుండి స్కూల్ కి వెళ్ళొచెమొ , అని అమ్మ అనింది.
సీన్ కట్ చేస్తే, టైం తోమ్మిడున్నర అయ్యింది..
కోస్ట్ క్లియర్ అని నిర్ధారించుకున్నాక, మెల్లిగా బెడ్ మీద నుండి లేచాను..వేలు నలిగితే, బెడ్ మీద రెస్ట్ ఎందుకు? అనే డౌట్ మీకు రావచ్చు..కానీ అదృష్టం బాగుండి మా అమ్మ నాన్నకి ఆ డౌట్ రాలేదు..
ఏది ఏమైనా, స్కూల్ ఎగ్గొట్టడం అనే అద్భుతమైన అనుభూతిని అమాంతం ఆస్వాదిస్తున్నా, అందులో ఆనందం మాత్రం ఏమాత్రం కనిపించనివ్వకుండా జాగ్రత్త పడ్డాను..
"ఇప్పుడెలా ఉంది నాన్నా?" అని అమ్మ అడిగింది..
"ఇంకా నొప్పిగానే ఉంది అమ్మ.." వేలు ఊదుకుంటూ జవాబిచ్చా..తగ్గిందని చెప్తే, ఇప్పుడైనా స్కూల్ కి పంపిస్తారేమో అని ఒక చిన్న అనుమానం వల్ల..
"తగ్గిపోతుందిలే " అని ధైర్యం చెప్తూ "కాసేపు పడుకో" అంది అమ్మ.
"కాసేపు పడుకో" - ఈ పార్ట్ అఫ్ ది సెంటెన్స్ నాకు నచ్చలేదు..ఇంత కష్ట పడింది , పడుకోడానికా? మీరైనా చెప్పండి..:)
ఊ అని ఉహు అని అనకుండా అలాగే పడుకున్నా..అమ్మ తన పనిలో తను నిమగ్నం అయ్యింది.
టైం గడియారం షాప్ లో అన్ని వాచీలు చూపించే అంట అయ్యింది...(అదేనండి 10 :10 ). టీవీ పెట్టాను..DD8 లో టెలిస్కూల్ ప్రోగ్రాం మొదలయ్యింది..మామూలుగా బోర్ కొట్టే ప్రోగ్రామే అయినా, ఆ రోజు ఎందుకో బాగా ఇంటరెస్టింగ్ గ అనిపించింది..
అల ఒక అరగంట గడిపాక, నేను మెల్లిగా బయట పడ్డాను. చేతిలో బాలు బాట్ తో..
అల ఒక అరగంట గడిపాక, నేను మెల్లిగా బయట పడ్డాను. చేతిలో బాలు బాట్ తో..
స్కూల్ కి డుమ్మా కొట్టాను అన్న ఆనందం ఒక గంట ఉందేమో..ఆ తర్వాత తెలిసింది..దుమ్మాకి సెలవు కి ఉన్న తేడా..
ఫ్రెండ్స్ ఎవరూ లేరు..రోడ్లన్నీ నిర్మానుష్యం.
కనీసం పక్క వీధిలో మనకి పెద్దగా పడని బ్యాచ్ కూడా కనిపించలేదు..
ఆదివారం రోజు కళకళలాడే రోడ్లేనా ఇవి అని నాకో డౌట్ వచ్చింది.
ఇంటి బయట అరుగు మీద కుర్చుని, ఎదురుగా ఉన్న గోడ కి బంతిని కొడుతూ కాసేపు..
చేతిలోని బాట్ తో బంతిని ఎన్ని సార్లు కోడతనో అని లెక్క పెట్టుకుంటూ కాసేపు..
వీధిలో పోయే సైకిళ్ళు , స్కూటర్లు లెక్క పెట్టుకుంటూ కాసేపు గడిపాను...
ఇంతలో, దూరంగా మా స్కూల్ లంచ్ బెల్ మోగిన శబ్దం. "ఇప్పుడు" పన్నెండున్నర అయిందా అనుకుంటూ, ఇంటికి వెళ్ళాను..
ఒక అయిదు నిమిషాల తర్వాత అక్క ఇంటికి వచ్చింది. అమ్మ ఇద్దరికీ భోజనం పెట్టి, తను తినింది..ఒక పక్క మా అక్కేమో, నేను ఎంచక్కా డుమ్మా కొట్టేశాను అని కుళ్ళుకుంటూ ఉండగా, నేను మాత్రం సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నా.
ఇప్పుడు నొప్పి కొంచెం తగ్గిందేమో కదా, హాఫ్ డే నుండి స్కూల్ కి వెళ్ళొచెమొ , అని అమ్మ అనింది.
అసలు స్కూల్ కి వెళ్ళడమే పెద్ద కష్టం అనుకుంటే, హాఫ్ డే నుండి స్కూల్ కి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ నరకం బయట ఉన్న గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోవడం తో సమానం.
ఆ సజెషన్ బొత్తిగా నచ్చని నేను, మళ్ళీ నాలోని నటుడిని ఉస్కో అని ఉసికొలిపా..
వాడు యధా విధిగా రెచ్చిపోవడం, ఆ సజెషన్ ని తోసిపుచ్చడం ఇట్టే జరిగిపోయాయి.
టైం 2 అయ్యింది. మళ్ళి అమ్మ పడుకోమ్మనింది..సరే, తప్పదు అనుకుని కాసేపు కిటికీ పక్కనే ఉన్న బెడ్ లో పడుకున్నా .
మధ్యాహ్నం మాత్రమే వచ్చే స్టీల్ సామాన్లు అమ్ముకునే వాళ్ళ అరుపులు , కుంకుడు కాయలు అమ్ముకునేవాళ్ళు తప్ప వేరే సౌండ్స్ ఏమి వినిపిచడం లేకపోవడం తో, ఇంకా నిద్ర పోయాను.
నిద్ర లో మా ఏరియా ఎమ్మెల్యే పుటుక్కుమన్నట్టు , బంగాళా ఖాతం , అరేబియా సముద్రం హిందూ మహాసముద్రం అన్నిట్లో కలిసి పెద్ద అల్ప పీడనం వచ్చినట్టు , పాత బస్తి లో అల్లర్లు చెలరేగినట్టు వస్తున్న అందమైన కలలను ఆస్వాదిస్తున్న టైం లో మా అక్క స్కూల్ నుండి వచ్చి, నన్ను నిద్ర లేపింది.
కల చెదిరిన కోపం కన్నా , ఫ్రెండ్స్ అంతా ఇళ్ళకు వచ్చేసారన్న ఆనందం , ఇప్పటికీ మరువలేను..
Subscribe to Posts [Atom]