Monday, August 17, 2009
సాఫ్ట్వేర్ మగధీర..
అనగనగా అమీర్పేట్ లో "రేపో మాపో టెక్నాలజీస్ " అని ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ. దాని CEO గుర్నాధం..
ఆ కంపెనీ ని టేక్ ఓవర్ చెయ్యడానికి అమెరికా నుండి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ప్లాన్ చేస్తుందని మన అమీర్పేట్ కంపెనీ వైస్-ప్రెసిడెంట్ వెంకటప్పయ్య గుర్నాధానికి చెప్పాడు..
గుర్నాధం మొహం మీద చిరు చెమటని చూసి వెంకటప్పయ్య , "ఎందుకలా ఉన్నారు సార్?మనం టేక్ ఓవర్ ని రేసిస్ట్ చేద్దాం " అని సలహా పారేసాడు..
గుర్నాధం దీర్ఘంగా నిట్టూర్చి, "నీకు ఆ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ గురించి ఐడియా లేదు.వాళ్లకి ఈ రిసెషన్ టైం లో కూడా బోలెడంత హాట్ కాష్ ఉంది. ఇప్పటికే మాదాపూర్ లో మూడు, అమీర్పేట్ లో ఏడు కంపెనీ లను మెర్జ్ చేసుకున్నారు.." అని చెప్పగానే వెంకటప్పయ్య విషయం సీరియస్నెస్ ని అర్ధం చేసుకున్నట్టు తల ఆడించాడు..
అప్పుడే అతనికి ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టింది..
ప్రోగ్రామర్ భైరవ్..
ప్రస్తుతం జూనియర్ ప్రోగ్రామర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్న అతను, కనీసం వంద ప్రోగ్రామ్స్ క్రాష్ చేయ్యనిదే కంపెనీ నుండి ఫైర్ అవ్వని "శతక్రాష్" వంశం లో పుట్టాడు..
ఇదిలా ఉండగా, అమెరికా నుండి వచ్చిన కంపెనీ పేరు, "ఎంతైనా కొంటా సొల్యూషన్స్ ".దానికి CEO షేర్ ఖాన్..
షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి చేసి , అతనికి ఆ పేరు వచ్చింది.
"రేపో మాపో టెక్నాలజీస్" బిల్డింగ్ బయట కార్ దిగి, షేర్ ఖాన్ , తన మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ తో, "డీల్ క్లోజ్ చెయ్యడానికి ఒక రెండు గంటలు చాలేమో?" అన్నాడు..
దానికి, వైస్ ప్రెసిడెంట్ ఏకాంబరం, "సర్ ,మీరు రేపో మాపో టెక్నాలజీస్ ని తక్కువ అంచనా వేస్తున్నారు సర్.., మనకి డీల్ కి మధ్య మనకి అడ్డుగా ప్రోగ్రామర్ భైరవ్ ఉన్నాడు.."
"కనీసం వంద ప్రోగ్రామ్స్ క్రాష్ చెయ్యందే , కంపెనీ నుండి ఫైర్ అవ్వని "శతక్రాష్" వంశం లో పుట్టిన భైరవ్ కి , ప్రోగ్రామింగ్ విస్కీ తో పెట్టిన విద్య.." చెప్పుకొచ్చాడు ఏకాంబరం..
శత్రువుని పొగుడుతున్న వైస్ ప్రెసిడెంట్ ఏకాంబరం మీద అసహనం వ్యక్తం చేస్తూ షేర్ ఖాన్,
"ఎంత భయంకరమైన ప్రోగ్రామరైనా , డీబగ్ చేస్తే కనిపించేది కోడె కదా " అన్నాడు..
"కాని, దానిని డీబగ్ చేసే మగాడు ఉండాలి కదా.." అన్నాడు ఏకాంబరం..
ఏకాంబరం మాటలకు చిర్రెత్తిన షేర్ ఖాన్, కోపం తో ఊగి పోతు , "వంద ప్రోగ్రామ్స్ క్రాష్ కాకుండా ఫైర్ అవ్వని వంశం లో పుట్టిన ప్రోగ్రామర్ భైరవ్ చరిత్ర అంతా ఒక బూటకం అని ప్రూవ్ చేయ్యనిదే తను అమీర్పేట్ మైత్రివనం వదిలి వెళ్ళను.." అని శపథం పూనాడు..
సీన్ కట్ చేస్తే, రేపో మాపో టెక్నాలజీస్ మెయిన్ డెవలప్మెంట్ సెంటర్ లో , ఒక పాత కంప్యూటర్ ముందు విండోస్ నెట్ మీటింగ్ లో భైరవ్ , షేర్ ఖాన్ తో యుద్ధానికి సన్నధం అయ్యాడు ..
ఆ చాట్ భారతం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఎస్.కే.(షేర్ ఖాన్): "మిస్టర్ "శతక్రాష్" భైరవ్..నువ్వు అన్ కండీషనల్ గా మా ప్రొపొసల్ ఒప్పుకుని, నీ హిస్టరీ అంతా ఒక స్పాం మెయిల్ అని ఒప్పుకుంటే, మీ రేపో మాపో టెక్నాలజీస్ ని అక్వైర్ చేసుకున్నాక కూడా నీ పోసిషన్ కన్ఫరం చేస్తాం..కాదు కూడదు అని వెధవ ప్రోగ్రామింగుతెలివి తేటలు చూపిస్తే మాత్రం, నీకు రిలీవింగ్ లెటర్ కూడా దొరకదు.."
పీ.బీ.( ప్రోగ్రామర్ భైరవ్ ): "నేను కూడా నీకు వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు కూడా వచ్చిన దారినే..ఐ మీన్, ట్రాఫిక్ ఎక్కువ ఉంటె, వేరే దారిలో అయినా , తిరిగి వెళ్ళిపోక పోతే, నీ కంపెనీ న్యూ యార్క్ స్టాక్ ఎక్సేంజ్ నుండి డీలిస్ట్ అయ్యినట్టే అనుకో.."
ఎస్.కే.: "నాకే వార్నింగ్ ఇస్తావా..బిల్ గేట్స్ తర్వాత బిల్ గేట్స్ అంతటి వాడిని నేను.."
పీ.బీ: " నీ ప్రాజెక్ట్స్ లో మోస్ట్ కాంప్లెక్స్ ఆబ్జేక్ట్స్ వంద స్పెక్కులు పంపించు.."
ఎస్.కే. " నా స్పెక్కులు రివ్యూ చేసేలోపు రిజైన్ చేస్తావ్..."
ఎస్.కే: "వంద స్పెక్కులకి ఒక్క స్పెక్కు తక్కువైనా ఓడినట్టే లెక్క.."
పీ.బీ: " ఎక్కువైనా పర్వాలేదు , లెక్క తక్కువ అవకుండా పంపించు.."
ఎస్.కే : " డెలివరీ మేనేజర్ దివాకరం..స్పెక్కులు తీసుకురా.. .."
పీ.బీ: " ఒక్కొక్క స్పెక్కు కాదురా, వంద స్పెక్కులు జిప్ చేసి పంపించు..."
అని ఇంకో విండో లో గూగుల్ వెబ్సైటు కి దణ్ణం పెట్టుకున్నాడు..మెయిల్ లో పంపిన వంద స్పెక్కులు ఒక్కోటి గా ఓపెన్ చేస్తూ, హల్లీవుడ్ మూవీస్ క్లైమాక్స్ థీమ్ సాంగ్స్ ప్లే చేస్తూ, కోడింగ్ స్టార్ట్ చేసాడు..
...............
int v_value1=0;
int v_value2 = 100;
int v_result = v_value2/ v_value1;............
Running program ZDGJHNL....divide by zero error..program aborted...
ఎస్.కే: "ఒక్కటి.."
for(int i =0; i>0; i++){//Do nothing....}
........................
while(1){////}........................
function xyz(int a){int b= xyz(a);}......................
function abc(int a){int b= def(a);}
function def(int a){int b= abc(a);}............................
circular references encountered...program terminated...
crashed..
unparesable errors..cannot proceed...
the program has performed an incorrigible error...
!@#$%^&*(^&*()_
ఎస్.కే: "పదకొండు.."
#$%^&*uhwrivfn
skdnvikk
78
71
48710
!@#$%!!!!!!!!!ggufbweln567798
ghuegfuhw
f 'q9r73287 40
1 9 '139 348819318 ftf'lp'kfp
ఎస్.కే: "ముప్పై రెండు , .."
పక్కనుండి ఏకాంబరం, " సార్, ముప్పై నాలుగు.." అని కరెక్ట్ చేసాడు..
అలా చూస్తుండగానే..యాభై...డెబ్బై...తొంభై..వంద!!!!! ప్రోగ్రామ్స్ క్రాష్ అయ్యాయి..
భైరవ్ అతి భయంకరమైన ప్రోగ్రామింగ్ పాటవాలు అది దగ్గరగా చూసిన షేర్ ఖాన్ కేఐ నోట మాట రావడం లేదు .."ఇంత కాలం, నేను అక్వైర్ చేద్దాం అనుకునే లోపు, మాలో మెర్జ్ అయిపోయే స్టార్ట్ అప్ కంపెనీలనే చూసాను..ఈరోజు నీద్వారా, ఒకపక్క ఫైర్ అవుతామని తెలిసి కూడా ప్రోగ్రామ్స్ ని ఫైర్ చేసే ప్రోగ్రామర్ ని మొట్ట మొదటి సారిగా చూస్తున్నా... నీ కోడింగ్ స్కిల్ల్స్ కి దాసోహం అయ్యాను..మీ కంపెనీ ని అక్వైర్ చేసుకుని, నిన్ను భరించే అంత కెపాసిటీ మా కంపెనీ కి లేదు..."అంటూ అమీర్పేట్ మైత్రివనం నుండి కార్ ఎక్కాడు...షేర్ ఖాన్...
Subscribe to Posts [Atom]