Monday, December 24, 2007

 

Falling in....

పడ్డాను ....
ఎక్కడ పడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అవ్వుద్దో...
అక్కడే పడ్డాను...
పెద్దలు చెప్పిన మాటలు పెడ చెవిన పెట్టి మరీ పడ్డాను...

ఒక పది రోజుల కిందటి సంగతీ...
బ్యాంక్ ఆఫ్ అమెరికా దగ్గర తనని చూసాను..
అంతే ..
నా మనసు నా మాట వినడం మానేసింది..
తను వెళ్ళే దారిలో నన్ను లాక్కెళ్ళింది..
నా మనసు తో పాటు నన్ను కూడా ....
తను ఎక్కడ మిస్ అవుతుందో అని పరుగందుకున్నాను....
ఐస్ క్రీమ్ బండి వెనకాల పరిగెత్తే పిల్లాడిలా...
తను ఆగింది...
నా గుండె కూడా ఆగినంత పని అయ్యింది...
నేను పరుగాపలేదు...
తను నా కోసమే ఆగింది అని నా మనసు చెప్పింది..

అంతలో ...
కాళ్ళకి ఏదో తట్టుకున్నట్టు నాకు తెలిసే లోగా...
...పడ్డాను...
బొక్క బోర్లా పడ్డాను...
తారు రొడ్డు మీద మోకాళ్ళు ఒరుసుకు పోయేలా పడ్డాను..
ఎక్కడ పడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో....
అక్కడే పడ్డాను....
బస్సు వెనకాల పరిగేత్తద్దు అన్న పెద్దల మాట పెడ చెవిన పెట్టి మరీ పడ్డాను.....

P.S: Issued in public interest by Just Ravi..

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]